హ్యాపీ బర్త్ డే టు నిహన్ష్ అంటూ ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యక్తిగత సహాయకుడు ( పీఏ) ఆలేటి రమేష్ కుమారుడు నిహన్ష్ మొదటి జన్మదిన వేడుకలు మల్లాపూర్ లోని స్వాగత్ కన్వెన్షన్ హాల్ లో వైభవంగా కన్నులపండువగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కేక్ కట్ చేసి నిహన్ష్ కు మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే టు నిహన్ష్ అంటూ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి , జర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ లు గంధం జోష్నా నాగేశ్వరరావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నేత గంధం నాగేశ్వరరావు, మల్కాజ్ గిరి పార్లమెంటు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ , కాప్రా, డిప్యూటీ కమిషనర్లు హాజరై నిహన్ష్ కు ప్రథమ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.