ప్రజెంట్ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది…మంచి కథాబలంతో తెరకెక్కిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ కోవలోనే ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్య ప్రదేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. మధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి పలు అందమైన లొకేషన్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా…
హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు జీవీకే ఒక మంచి హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి అయింది. తాజాగా మధ్య ప్రదేశ్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది“ అన్నారు
దర్శకుడు జివికె మాట్లాడుతూ – సరికొత్త హారర్ థ్రిల్లర్ కథాశంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. వీ ఎఫ్ ఎక్స్‌కి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్ ని క్యారీ చేస్తుంది. ఏపి, తెలంగాణ, మధ్య ప్రదేశ్ ఇలా మూడు రాష్ట్రాల్లో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశాం అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – మధ్య ప్రదేశ్ షెడ్యూల్‌లో మాకు పూర్తి సహకారం అందించిన శ్రీ సిలంధర్ (IAS)గారికి, శ్రీ అజయ్ పాండే (SP) గారికి, శ్రీ ఎజి కుమార్ (DISTRICT CEO) గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ ముఖ్య తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జివికె
బేనర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
నిర్మాతలు: కెఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వై. అనిల్ కుమార్, కె. శ్రీనివాస్‌రావు
డిఓపి: జె ప్రభాకర్ రెడ్డి
మ్యూజిక్: పద్మనాబ్ భరద్వాజ్
ఎడిటింగ్: సాయిబాబు తలారి
ఫైట్స్: అంజి మాస్టర్
లిరిక్స్: ఉమా వంగూరి
కొరియోగ్రఫి: రాజ్ కృష్ణ
పిఆర్ఓ: సిద్ధు.