మన్యం ధీరుడు సినిమాలోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నది. ఈ సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.
Home videos devotional ‘మన్యం ధీరుడు’లోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” గీతానికి ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం !