మస్ట్ వాచ్: ఆహాలో అదరగొడుతున్న చైతన్య రావ్ ‘డియర్ నాన్న’

0
43
Must Watch: Chaitanya Rao's 'Dear Nanna'
Must Watch: Chaitanya Rao's 'Dear Nanna'

యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఫాదర్ డే స్పెషల్ గా ఈ చిత్రం జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
డియర్ నాన్న చూసిన ఆడియన్స్ సినిమాకి టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు. కరోనా బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ సన్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.
చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా చూపించారు.
తండ్రి కొడుకులుగా నటించిన చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య ఎమోషనల్ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. మెడికల్ షాప్ తనకి బిజినెస్ కాదని చెప్పే సన్నివేశాలు ఆకట్టుకునేలా వున్నాయి.
ముఖ్యంగా కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు.
చైతన్య రావ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యష్ణ చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. సూర్య కుమార్ భగవాన్ దాస్ తో పాటు సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.
అనిత్ కుమార్ మాధాడి కెమరాపనితనం ఆకట్టుకుంది. గిఫ్టన్ ఎలియాస్ నేపధ్య సంగీతం మరో ఆకర్షణగా నిలిచింది.
మంచి ఎమోషన్స్, వాల్యుబుల్ స్టొరీ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, సూపర్ పెర్ఫార్మెన్స్ లతో వచ్చిన డియర్ నాన్న ఈ వీకెండ్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీగా స్ట్రీమ్ అవుతోంది.