యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటించారు. . ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపించారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13, 2024)న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ: రాధా(రాజ్ తరుణ్) పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కి అమ్మాయిలకు చీరలు కడుతూ శారీ డ్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. రాధ తల్లి గౌరీ(అభిరామి) బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటుంది. అదే బ్యాంక్ లో కృష్ణ(మనీషా కందుకూర్) చేరుతుంది. రాధ చేసే వంట బాగా నచ్చి కృష్ణ, గౌరీ దగ్గరవుతారు. ఆ వంటతో రాధని ఇష్టపడుతుంది కృష్ణ. ఒకరికొకరు పరిచయం లేకుండానే ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడతారు. అనుకోకుండా కృష్ణ ఫ్రెండ్(ప్రీతీ ఇందు) పెళ్ళికి రాధనే శారీ డ్రాపర్ కావడంతో ఒకరికొకరు తెలియకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు అవుతాయి. అనుకోకుండా గౌరీ వల్ల ఇద్దరూ కలిసి ఆ తర్వాత ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. రాధా కృష్ణ ఎంగేజ్మెంట్ లో కృష్ణ ఫ్రెండ్ వచ్చి తన భర్త సంసారానికి పనికిరాడు అని అతనికి డైవర్స్ ఇస్తున్నాను అని చెప్పి, రాధా కూడా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు, నువ్వు రెచ్చగొట్టినా దూరం పెడతాడు ఆలోచించు అని చెప్పడంతో కృష్ణ కూడా రాధా సంసారానికి పనికిరాడేమో అని ఫిక్స్ అయిపోతుంది. ఆ సమస్య కోసం రాధకు చెప్పకుండా కృష్ణ ఒక ఆశ్రమానికి తీసుకెళ్తుంది. కృష్ణ అనుమానం తీరుతుందా? తనని అనుమానిస్తోంది అని రాధకు తెలుస్తుందా? ఆశ్రమంలో ఏం జరిగింది? రాధా నాన్న ఎవరు? అసలు రాధా ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడు? రాధా కృష్ణల పెళ్లి జరిగిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ.. ఈ రోజుల్లో అబ్బాయిలు మంచిగా ఉంటే వీడు అబ్బాయా అని అనుమానిస్తున్నారు. బయట సొసైటీలో జరిగే ఈ పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భలే ఉన్నాడే సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా రాధ, కృష్ణ క్యారెక్టర్స్ గురించి చెప్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీతో ఫుల్ కామెడీగా చూపించారు. సెకండ్ హాఫ్ లో రాధ కృష్ణ మధ్య ప్రేమ సన్నివేశాలు, రాధ తల్లి కథతో మంచి ఎమోషన్ ని పండించారు. దర్శకుడు ఒక కొత్త కథని చాలా బాగా చెప్పాడు. అయితే సెకండ్ హాఫ్ లో రచ్చ రవి చేసే కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్, కొంత సాగదీత తప్ప సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ కూడా కొత్తగా రాసుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో కొంత మంది అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, అమ్మాయిలకు దూరంగా ఉంటూ, ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేతకానివాడిలాగా చూస్తున్నారు. వాడు అబ్బాయే కాదు అనేలా చూస్తున్నారు అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. అలాగే పెళ్ళికి ముందే తప్పు చేసి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ఎమోషనల్ గా ఆలోచించే విధంగా చూపించారు. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ఓ ఇష్యూతో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ పక్కన పెట్టి సినిమా పాజిటివ్ టాక్ తో జనాల్లో వ్యాప్తి చెందితే సినిమా హిట్ అవ్వడం పక్కా. మూవీ టీమ్ కూడా ఇంకొంచెం ప్రమోషన్స్ చేస్తే జనాలకు మరింత రీచ్ అవుతుంది ఈ సినిమా.
నటీనటుల పర్ఫార్మెన్స్: రాజ్ తరుణ్ అద్భుతంగా నటించాడు. శారీ డ్రాపర్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనీషా కందుకూర్ కూడా తన పాత్రలో నటనతో, అందంతో కూడా మెప్పించింది. అమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టేసింది. గెస్ట్ పాత్రలో లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాస్, లీలా శ్యాంసన్ క్యూట్ గా మెప్పించారు. హైపర్ ఆది, సుదర్శన్, తమిళ్ స్టార్ కమెడియన్ VTV గణేష్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. గోపరాజు రమణ, అమ్ము అభిరామి, ఇందు ప్రీతీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు: సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్. చాలా రోజుల తర్వాత కొత్తగా అనిపించే మంచి సాంగ్స్ వినిపించారు. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొత్త కథని సింపుల్ స్క్రీన్ ప్లేతో ఫ్రెష్ గా చూపించాడు దర్శకుడు శివ సాయి వర్ధన్. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన శివసాయి దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాణ పరంగా సినిమాకి బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు నిర్మాత కరుణ్ కుమార్. సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై క్వాలిటీగా కనిపిస్తుంది.
రేటింగ్: 3.25