మూవీ రివ్యూ : ఆకట్టుకునే ‘శివంగి’!

0
35
Movie Review: Impressive 'Shivangi'!
Movie Review: Impressive 'Shivangi'!

నరేష్ బాబు పంచుమర్తి నిర్మాతగా ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై దేవరాజ్ భరణి ధరన్ రచన దర్శకత్వంలో ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శివంగి’. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానపాత్రలో జాన్ విజయ్, కోయా కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాశీఫ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. భరణి కె ధరన్ ఈ చిత్రానికి డిఓపి గా పని చేయగా రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్గా, సంజిత్ మహమ్మద్ ఎడిటర్ గా పని చేశారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ కు ఈశి వంగి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ : ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లో చూపించిన విధంగానే సత్యభామకు ఒకే రోజు ఊహించుకొని సమస్యలు ఎదురవుతాయి. తన భర్త ఆరోగ్య పరిస్థితి, తన అత్త నుండి ప్రెషర్, తమ తల్లిదండ్రులు వరదలలో చిక్కుకోవడం, తనకు అవసరం అయిన డబ్బు తనకు సమయానికి దక్కకపోవడం ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే అటువంటి సమస్యల సమయంలో సత్యభామ పోలీసులను కాంటాక్ట్ చేయడమేంటి? అసలు పోలీసులు వచ్చే విధంగా ఏం జరిగింది? ఎవరైనా చంపబడ్డారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా? అసలు సత్యభామ సమస్యలకు పరిష్కారం దొరికిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం శివంగి చిత్రం.

విశ్లేషణ: ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలకు ఎలా ఎదురు నిలిచింది, ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలతో ఎటువంటి దారిలో సమాధానం ఇచ్చింది, ఆ సమస్యల నుండి ఎలా పరిష్కరించుకుంది అనే ప్రశ్నలకు ఈ చిత్రం మంచి సమాధానం. ఈ ‘శివంగి’ చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ ..డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా, ఎంతో డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా ఉంది. కథ, నిర్మాణ విలువలు, నటీనటులు నటన, బీజీఎం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా చూసుకున్నాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే… సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాము. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడ కూడా గ్రామర్ షో లేకుండా కేవలం రెండు చీరలలో మాత్రమే చిత్రమంతా కనిపిస్తూ అలాగే డైలాగ్స్ తో ఎంతో బాగా నటించారు. అదేవిధంగా పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ మరొక యాక్టింగ్ స్టైల్ ఉందని చూపించారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా తమ పరిధిలో తాము నటిస్తూ ముందుకు సాగారు.

టెక్నీకల్ విషయాలకొస్తే… నిర్మాణం విలువలకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ముందుచూపుతో ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్థమవుతుంది. సినిమా అంతా సుమారు ఒకటే ప్లేస్ లో ఉండటంతో ప్రతి బ్యాగ్రౌండ్ లోను మంచి యాభీయన్స్ ఉండేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కలరింగ్ ఇంకా ఇతర నిర్మాణ విలువలు ఎంతో అద్భుతంగా వచ్చాయి. సినిమా అంతటా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఆ ఇంట్రెస్ట్ కు తగ్గట్లు ప్రతి సీన్లను మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను మరింత పెంచే విధంగా సంగీత దర్శకుడు ఈ చిత్రానికి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

రేటింగ్ : 3/5