టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

0
50
Minister Ponguleti launched the TWJ diary
Minister Ponguleti launched the TWJ diary

మగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శి కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ కు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. విరాహత్ అలీ, కె. రాంనారాయణ లు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.