అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

0
20
Minister Konda Surekha Unveils the Poster and Trailer of Abhinav
Minister Konda Surekha Unveils the Poster and Trailer of Abhinav

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సుధాకర్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సమాజ శ్రేయస్సు కోసం, లాభాపేక్ష లేకుండా ఈ చిత్రాన్ని భీమగాని సుధాకర్ గారు నిర్మించడం అభినందనీయం అన్నారు. డ్రగ్ మాఫియా విద్యార్థులను సైతం వడలడంలేదు. చిత్ర ట్రైలర్ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది. గంజాయి మాఫియా మరియు డ్రగ్ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుకున్న గిరిజన అనాధ బాల కార్మికులను, హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు యోగ మరియు ఆర్మీ శిక్షణ తీసుకొని గంజాయి మాఫియాను డ్రగ్ మాఫియాను ఎలా అంతం చేసారు అనే కధాంశంతో చిత్రం ఉంటుంది అన్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్. బాలల చిత్రం అయినా యాక్షన్ సన్నివేశాలతో బలమైన కధాంశంతో పూర్తిగా ఉత్కంఠ భరితంగా ఈ చిత్రం రూపొందించబడింది. దీనికి కథ మాటలు పాటలు, నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, ఎడిటర్ నందమూరి హరి. సారథి స్టూడియో సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు నిర్మాత తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అతి త్వరలో నూన్ షో గా ధియేటర్లలో చిత్రం విడుదల చేయబోతున్నట్లు నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్ వెల్లడించారు.