మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

0
11
"Kalivi Vanam" movie poster launch by media

ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. ఈ చిత్రానికి జియల్ బాబు సినిమాటోగ్రాఫర్ చేయగా మదీన్ ఎస్ .కె సంగీతం ఎడిటర్ చంద్రమౌళి మాటలు కోటగల్లి కిషోర్ అందించారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా హీరోయిన్ గా నాగదుర్గ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల.కమల్ ఇస్లావత్ ఈ చిత్రానికి పాటలు అందించారు.

ఈ చిత్రం వనములను సంరక్షించుకునే కాన్సెప్ట్ తో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలోని సారంగాపూర్ అడవులలో చిత్రీకరించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన బలగం, పొట్టేల్ వంటి చిత్రాలు లాగా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పాటలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా యూట్యూబ్ మీడియా మిత్రులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో కొండగట్టు బృందావన్ రిసార్ట్ లో ఈ చిత్ర పోస్టర్ లాంచ్ ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మై విలేజ్ షో శ్రీకాంత్, చందు, ధూమ్ ధాం ఛానల్ రాజు, యూట్యూబ్ స్టార్ టోనీ క్విక్, అక్షిత్ మార్వెల్, వెంకట్ జోడు, బబ్లూ, శివ వేల్పుల, అంతడుపుల నాగరాజు, రేంజరాళ్ల రాజేష్, బాలు కాయత్, డైరెక్టర్ హరి చరణ్, యమున తారక్, సింగర్ శిరీష, నాగలక్ష్మి, హరీష్ పటేల్, సౌజన్య, ప్రొడ్యూసర్ గుగ్గిళ్ళ శివప్రసాద్, మౌనిక డింపుల్, జి ల్ బాబు సినిమా అటోగ్రార్, మదీన్ ఎస్ కె, కమల్ ఇస్లావత్ తదితరులు పోస్టర్ లంచ్ కార్యక్రమాలకు హాజరై చిత్ర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here