‘మిస్మ్యాచ్డ్’, ‘ది బ్రోకెన్ న్యూస్’ మరియు ‘జిగాడిస్తాన్’ వంటి ఓటిటి షోలలో మరియు సంగీతప్రధానమైన ‘అల్లాడిన్’ లో టైటిల్ రోల్ లో పనిచేసిన నటుడు మరియు సంగీతకారుడు తారక్ రైనా ఎప్పుడు కొత్త సృజనాత్మక సవాళ్ళ కొరకు ఎప్పుడు వెతుకుతుంటారు. జీ థియేటర్ యొక్క టెలీప్లే ‘ధూమ్రపాన్’ లో పనిచేయడం అతనికి ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని ఇచ్చింది మరియు దీని గురించి ఆయన ఇలా చెప్పారు, “ఈ నాటకము వివిధ జీవన దారులలో ఉన్న అయిదుమంది డైనమిక్స్ ను మరియు వారిలో ప్రతి ఒక్కరు ఒకే రకమైన పరిణామాన్ని, భిన్నంగా ఎదుర్కొంటారు అనేది చూపుతుంది.”
ఈ కథ ఒక కార్పొరేట్ కార్యాలయములోని ధూమపాన ప్రదేశములో మొదలు అవుతుంది. ఇక్కడ ఉద్యోగులు అందరు తమ మనోవేదనలను చెప్పుకోవటానికి, అంచనాలను చర్చించటానికి, రాజకీయాలు మరియు వారికి ఒత్తిడిని కలిగించే సమస్యల గురించి చెప్పుకోవటానికి కలుస్తారు. ధూమపాన ప్రదేశము ఒక రకమైన రూపకమని చెప్తూ తారక్ ఇలా అన్నారు, “ధూమపాన ప్రదేశము అనేది కార్పొరేట్ ఉద్యోగులు తాత్కాలికంగా వాస్తవం నుండి తప్పించుకోగలిగే సురక్షితమైన స్వర్గం వంటిది. కొంతమంది విపరీతమైన పోటీ ఉన్న కార్పొరేట్ ఒత్తిడుల నుండి తప్పించుకోవటానికి వారికి ఇష్టం లేకపోయినా పొగత్రాగడం ప్రారంభిస్తారు.”
ఈ టెలీప్లేను తెలుగులోకి అనువదించడం అనేది ఒక మంచి ఆలోచన అని తారక్ విశ్వసిస్తున్నారు మరియు ఇలా చెప్పుకొచ్చారు, “హైదరాబాదు దేశములోనే అత్యంత సాంకేతిక-శక్తి కలిగిన నగరం మరియు ఇది స్థానిక టెక్నలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వెన్నెముక. పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాలలోని వారు ఈ నాటకం యొక్క ముఖ్యమైన ప్రేక్షకులు, ఎందుకంటే ప్రతి రోజు వారు అత్యధిక ఒత్తిడితో పనిచేస్తూ ఉంటారు.”
‘ధూమ్రపాన్’ కు ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు మరియు ఇందులో శుభ్రజ్యోతి భరత్, ఆకర్ష్, సార్థక్ కక్కర్, సిద్ధార్థ్ కుమార్, లిషా బజాజ్ మరియు ఘన్‌శ్యాం లాల్సా నటించారు. దీనిని ఎయిర్టెల్ స్పాట్ లైట్, డిష్ టివి రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్ పై చూడండి.