ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత రావు, సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఎ. రాజేష్, కార్యవర్గ సభ్యులు వసంత్, బాపు రావు, ఎం. రమాదేవి, టి. శ్రీనివాస్ తో పాటు ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు హాజరయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అధ్యక్షులు వేణుగోపాల నాయుడు సూచించారు. ఆనాటి పోరాట యోధుల త్యాగ ఫలితంతో మనం స్వేఛ్చను అనుభవిస్తున్నామని అన్నారు. నేటి తరానికి వారి త్యాగాలను వివరించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని వేణుగోపాల నాయుడు కోరారు.