రోహిత్‌తో పాటు స్టార్‌ ప్లేయర్‌ ముంబైకు గుడ్‌బై!

0
63
Goodbye to Rohit and star player Mumbai!
Goodbye to Rohit and star player Mumbai!

ఐపీఎల్‌-2024 ముగిసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ సాధించింది. 2012, 2014 సీజన్లలోనూ కేకేఆర్‌ విజేతగా నిలిచింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్సీబీ అత్యధిక స్కోరు రికార్డు ఏకంగా మూడు సార్లు బద్దలైంది. సిక్సర్ల, సెంచరీ మోత మోగింది. ఈ సీజన్‌లో జట్టు ప్రదర్శనల పరంగానూ అనూహ్య ఫలితాలు చోటుచేసుకున్నాయి. అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయాయి. సీఎస్కే జట్టులో గాయాల సమస్య ఉండగా, ముంబై జట్టుది విభిన్నమైన కథ. హార్దిక్‌ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అందించడంతో ముంబై జట్టులో అంతర్గతంగా గ్రూపలు ఏర్పాడ్డాయని ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు జట్టులో స్టార్‌ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టుగున నిలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌కు జట్టులో ముంబై ఫ్రాంచైజీ భారీ మార్పులు చేయనుందని భావిస్తున్నారంతా. ముంబై ఏ ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంటనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. అయితే ముంబై జట్టులో రోహిత్‌ శర్మ కచ్చితంగా ఉండడని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెడుతుందని, లేదా రిటైన్‌ చేసుకోవడానికి హిట్‌మ్యానే అంగీకరించడని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. రోహిత్‌తో పాటు స్టార్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా ముంబై జట్టు వీడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. ‘’ఇషాన్‌ కిషన్‌ను వదిలేసే అవకాశాలు ఉన్నాయి. అతన్ని రిటైన్‌ చేసుకోరు. ఒకవేళ ఇషాన్‌ను జట్టులో ఉంచుకోవాలంటే రైట్‌ టూ మ్యాచ్‌ కార్డ్‌ను ఫ్రాంచైజీ ఉపయోగిస్తుంది. అంతేకానీ ఇషాన్‌ కోసం రూ.15.5 కోట్లు వెచ్చించదు. ఇది చాలా ఎక్కువ’’ ’ఇక రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడేశాడని భావిస్తున్నా. రిటైన్డ్‌ కావాలని రోహిత్‌ ఆశించకపోవచ్చు లేదా రోహిత్‌ను ముంబై విడిచిపెట్టవచ్చు. ఏదేమైనప్పటికీ అతను మళ్లీ ముంబై జెర్సీ ధరించడని అనుకుంటున్నా. నా అంచనా తప్పు కావొచ్చు. కానీ రోహిత్‌ వచ్చే సీజన్‌లో ముంబైకు ఆడడని నాకు అనిపిస్తోంది’’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.