ధరలతో కళతప్పుతున పండగలు… బాణా సంచా ధరల మోత !

0
35
Festivals with prices... firework price rise!
Festivals with prices... firework price rise!

రల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బాణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపావళి ప్రత్యేకతే వేరు. అయితే బాణాసంచా ధరలు కూడా విపరీతంగగా పెరిగాయి. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలి. అలాగే ధరలు దాడి చేస్తున్న వేళ కలసి పండగ జరుపుకోవాలని, బాణాసంచా కాల్చాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. దీపావళి రోజు దీపాలు వెలిగించి, లక్ష్మీపూజలతో, ఇంటి పిండి వంటలకే ప్రాధాన్యం ఇస్తూ పండగ జరుపుకోవడం ఉత్తమం. ఏటా దీపావళి పర్వదినాన్ని పిల్లాపెద్దలు కసలి ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా దీపాల పండుగను జరుపుకొంటారు. దీపాల పండుగ వేడుకలకు ప్రజలు ముందుగానే దీపాలు వెలిగించేందుకు సిద్దం కావడం ఈ యేడాది విశేషంగా చెప్పుకోవాలి. తగంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ప్రజలు దీపాలను వెలిగించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు మహిళలు ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో పరిమిత ఖర్చుతోనే  ప్రజలు గ్రీన్‌ దీపావళి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పటాసులు కొనుగోలు చేయకుండా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరల దెబ్బంతో వెలుగుల పండుగ దీపావళి కళతప్పుతోందన్న భావన రాకుండా దీపాలను వెలగించి పూజలలో భక్తిప్రపత్తులు చాటడం ముఖ్యం. అయితే తారాజువ్వల వెలుగులు, టపాసుల మోతలతో సందడిగా సాగాల్సిన పండుగ రోజు ఈసారి నిశబ్దంగా గడిచిపోనుందన్న భావన పిల్లల్లో ఉండడం సహజం. పర్యావరణహితం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏటా పండుగకు వారం ముందునుంచే బాణాసంచా విక్రయాలతో సందడి ప్రారంభమవుతుంది. బాణాసంచా దుకాణాలకు అనుమతి పక్రియలో భాగంగా ఒక్కో దుకాణదారుడు రూ.30వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఒక్కో దుకారణదారుడు సుమారు లక్ష నుంచి రూ.5లక్షల వరకు బాణసంచా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అమ్మకాలు సాగుతాయా లేవా అన్న భయం ఉంది.