మద్యానికి,డ్రగ్స్ కు బానిసలు గా మారవద్దని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అన్నారు.బుధవారంనాడు తుకారాం గేట్ లో డిబిఎఫ్ అధ్వర్యంలో మద్యం, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారొద్యమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పులి కల్పన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు,మద్యానికి బానిసలై భవిష్యత్తు గందరగోళంగా మార్చుకుంటున్నారన్నారు.మద్యం అమ్మకాలను ఆరికట్టాలని డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్ వల్ల కుటుంబాలు చితికిపొతున్నాయని ,మహిళల పై హింస అత్యాచారాలు పెరిపొతున్నాయన్నారు.ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ నగర కన్వీనర్ ఉమక్క,మారెడుపల్లి మండల డిబిఎఫ్ అధ్యక్షురాలు బన్నమ్మ ,అనుష,భవాని తదితరులు పాల్గొన్నారు