“షోలే”, “ఆర్ఆర్ఆర్” తరహా వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో రూపొందనున్న “దో కమీనే”
టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర వారసులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా “దో కమీనే” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. “షోలే”, “ఆర్ఆర్ఆర్” కలిపితే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యాక్టర్స్ శ్రీకాంత్, సుమన్, దర్శకులు బి గోపాల్, ఎఎస్ రవికుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్ క్లాప్ నివ్వగా బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించారు, నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా
డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ – పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దో కమీనే సినిమాను రూపొందిస్తున్నాం. ఈ రోజు మా మూవీ ప్రారంభోత్సవానికి ఎంతోమంది మిత్రులు, పెద్దలు వచ్చి ఆశీర్వదించారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. నా మిత్రుడు చంద్ర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 3వ వారం నుంచి దో కమీనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మా మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. అన్నారు.
నిర్మాత చంద్ర పులుగుజ్జు మాట్లాడుతూ – అందరికీ దసరా శుభాకాంక్షలు. మా చంద్ర క్రియేషన్స్ బ్యానర్ లో దో కమీనే సినిమాను ఘనంగా లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సముద్ర గారి దర్శకత్వంలో ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాం. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి చిత్రాలు మా సంస్థ నుంచి వస్తాయి. అన్నారు.
హీరోయిన్ తస్మయి మాట్లాడుతూ – దో కమీనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్ తో హీరోయిన్ గా పరిచయం కావడం సంతోషంగా ఉంది. అరుణ్, రామ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరో రామ్ త్రివిక్రమ్ మాట్లాడుతూ – నాన్న సముద్ర గారి దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు మా ప్రొడ్యూసర్ చంద్రగారికి థ్యాంక్స్ చెబుతున్నాం. త్వరలోనే ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అన్నారు.
హీరో అరుణ్ మహాశివ మాట్లాడుతూ – హీరోగా నేను ఇండస్ట్రీకి రాగలనా అని అనుకునేవాడిని. చంద్ర గారి ప్రొడక్షన్ తో దో కమీనే సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. చంద్ర గారితో పాటు నాన్న సముద్ర గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి టీమ్ మా మూవీకి కుదిరింది. ప్రేక్షకులకు అన్ని ఎలిమెంట్స్ అందించే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటి భవ్య మాట్లాడుతూ – దో కమీనే సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అరుణ్, రామ్, గీత, తస్మయి ..మేమంతా మంచి టీమ్ లా వర్క్ చేయాలని అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి గీత మాట్లాడుతూ – ఈ రోజు మా దో కమీనే సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ మూవీలో మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సముద్ర గారి దర్శకత్వంలో నటిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ – సముద్ర గారి సినిమాకు మ్యూజిక్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇప్పటికే 5 పాటలు రికార్డ్ చేశాం. బీజీఎం కూడా బాగా చేయబోతున్నాం. దో కమీనే సినిమా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటి శివపార్వతి మాట్లాడుతూ – సముద్ర గారి గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. వారి పిల్లలు ఇద్దర్ని చూస్తుంటే మంచి స్పార్క్ ఉంది అనిపిస్తోంది. ఈ టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దో కమీనే సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్, తస్మయి, శ్రీ రాధ, భవ్య, గీత, సుమన్, కన్నడ కిషోర్, సునీల్, బ్రహ్మానందం, అలీ, రవి కాలే, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, ఈశ్వరీ రావ్, గోలిసోడ మధు, ఝాన్సీ, జేఎల్ శ్రీనివాస్, రాణి తిరుమల శెట్టి, సునీత ప్రియదర్శి, సీఎస్ఆర్, శాంతి కృష్ణన్, కోమలపాటి గీత, ఖదీర్, తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – ఘటికాచలం
మేకప్ – బాషా
కాస్ట్యూమ్స్ – మెహబూబ్
ఆర్ట్ – విజయ్ కృష్ణ
ఫైట్స్ – నందు, సెల్వన్, మల్లి, రామ దాసు
డ్యాన్స్ – అజయ్, స్నేహ
మ్యూజిక్ – వినోద్
సినిమాటోగ్రఫీ – శ్రీ వెంకట్
ఎడిటింగ్ – నందమూరి తారకరామారావు
పీఆర్ఓ – వై రవికుమార్
ప్రొడ్యూసర్ – చంద్ర పులుగుజ్జు
రచన, దర్శకత్వం – వి సముద్ర