విజయదశమి సందర్భంగా డియర్ కృష్ణ మూవీ పోస్టర్ లాంచ్

0
50
Dear Krishna movie poster launch on the occasion of Vijayadashami
Dear Krishna movie poster launch on the occasion of Vijayadashami

పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథకు దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే నమ్మే ఒక భక్తుడు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఒక మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ ఇతివృత్తమే డియర్ కృష్ణ సినిమా సబ్జెక్ట్. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ పేర్కొన్నారు.ఈ చిత్రం ఎంతో మందికి స్పూర్తిగా ఉంటుంది అని, ఇదే సమయంలో యూత్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని, నేటితరం అభిరుచికి తగ్గట్టుగానే ఈ కథను తెరకెక్కించినట్లు డైరెక్టర్ దినేష్ బాబు తెలిపారు. ఈ దసరా సందర్భంగా డియర్ కృష్ణ చిత్రం పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే మంచి అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.చిత్రం: డియర్ కృష్ణ
నటీనటులు: అక్షయ్, మమిత బైజు, ఐశ్వర్య, అవినాష్, సమీర్, లోహిత్, రక్ష తదితరులు..
రచయిత & ప్రొడ్యూసర్: పీ ఎన్ బలరామ్
డైలాగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన : దినేష్ బాబు
సినిమాటోగ్రపీ : దినేష్ బాబు
ఎడిటర్ : రాజీవ్ రామచంద్రన్
సంగీతం : హరి ప్రసాద్
లిరిక్స్: గిరిపట్ల
చీఫ్ అసోసియేట్ అండ్ అడిషనల్ డైలాగ్స్: నాగ నందేశ్వర్ గిడుతురి(నందు)
పీఆర్ఓ: హరీష్, దినేష్