దేశంలో మహిళలందరినీ ఆర్థికంగా బలోపేతం చేస్తూ మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, ఇన్చార్జి స్టేట్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళా సభ్యత్వాలలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష 400 సభ్యత్వాలను చేసి ముందంజలో నిలబడిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల ద్వారానే పదవులు ఇవ్వడం జరుగుతుంది. మహిళా అభివృద్ధికి మహిళల బలోపేతానికి కృషి చేసినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళ కు 6 గ్యారంటీలు భాగంగా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన నారు తాజాగాదేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం 500 కే గ్యాస్ సిలిండర్ గృహ అవసరాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు మహిళా శక్తి పథకాలు ద్వారా మహిళలలో క్యాంటీన్లు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించిందన్నారు. అతి వల్ల ఆర్థిక స్వాలంబని ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు.
ఇందిరా మహిళా శక్తి 2025 మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ రేవంతన్న ప్రభుత్వం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రివ్యూ మీటింగ్ లో స్టేట్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి జనరల్ సెక్రెటరీ దివ్య సెక్రెటరీ కళ్యాణి జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది పదవులు వస్తాయని తెలియజేయడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్యపరంగా సేవలందిస్తున్న ఏఎన్ఎం లను మరియు ఆశ వర్కర్లకు. జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. స్టేట్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి జనరల్ సెక్రెటరీ దివ్య సెక్రెటరీ కళ్యాణి జిల్లా సభ్యులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సభ్యత్వాలు చేసిన వారికి పదవులు తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత జిల్లా ఉపాధ్యక్షురాలు నీరజ. జనరల్ సెక్రెటరీ లు వనజ రెడ్డి కవిత లక్ష్మి పరంజ్యోతి యాట విజయ సిద్ధి లక్ష్మి స్వరూప మాధవి నాగ లక్ష్మి ఝాన్సీ దీప రజిత పాము అనిత అన్నెపు పద్మ స్వాతి గుండు జ్యోతి కస్తూరి చింతకింది రేణుక జ్యోతి భానుమతి పద్మ ఎల్లమ్మ కేతమ్మ మండల కమిటీ మెంబర్లు. గ్రామ శాఖ అధ్యక్షులు మొదలగు వారు పాల్గొన్నారు.