మహబూబాబాద్ జిల్లా లో దారుణం…
ముక్కుపచ్చలారలేదు.. తల్లి చనుబాలనైనా ఆస్వాదించలేదు.. వెరసి రోజుల వయసు ఉన్న బాలుడు కుక్కల దాడిలో తీవ్ర గాయాలపాలై కనుమూసిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో
అమ్మమ్మ ఇంటి దగ్గర ఘటన బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామం. ఇంట్లో ఉబ్బరంగా ఉందని 42 రోజుల వయసు ఉన్న బాలుడిని తల్లి ఆరుబయట గుమ్మానికి ఎదురుగా పడుకోబెట్టింది. ఈ క్రమంలో అదును చూసి అక్కడికి వచ్చిన కుక్కలు చిన్నారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో చిన్నారికి గాయలై తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు విడిచాడు. అయితే, తీవ్ర గాయాలతో కొడకును చూసి రోదించిన తల్లిదండ్రులను చూసి గ్రామస్థులు పత్రి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.