హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యను ఆశీర్వదించి గెలిపించాలని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు. రాష్ట్రంలోని రైతులను, ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు ఎలాంటి న్యాయం చెయ్యలేదన్నారు. కాబట్టి బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య ను గెలిపించాలన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
ఈ నెల 27 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య అన్నారు. నిజామాబాద్ లో జరిగిన ఉపాధ్యాయుల సమావేశం లో అయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో డిఎస్సీ వేయలేదని,. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యలకు ఫీజు రీయంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నరన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనకు వచ్చే ఎమ్మెల్సీ జీతాన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెచ్చిస్తానన్నారు