Balakrishna Daaku Maharaaj Movie Review In Telugu: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ: ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !

0
9
Balakrishna Daaku Maharaaj Movie Review In Telugu:
Balakrishna Daaku Maharaaj Movie Review In Telugu:

(చిత్రం : డాకు మహారాజ్ , విడుదల :12 జనవరి-2025, రేటింగ్ : 3.75/5, తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు. సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్)

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాలయ్య మార్క్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయనే సంగతి తెలిసిందే.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా “డాకు మహారాజ్”. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….

కథ : ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఇరిగేషన్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ) కొన్ని కారణాల వల్ల ఠాకూర్ ఫ్యామిలీ నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాడు. మైనింగ్ కింగ్ (బాబీ డియోల్) సీతారాంను తన స్వార్థం కోసం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు.
నానాజీని మదనపల్లి హిల్స్ స్టేషన్‌లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు. మరోపక్క సీతారాం మరియు అతని భార్య (ప్రగ్యా జైశ్వాల్‌) మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు. వీరు మార్బుల్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో సీతారాం వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారతాడు. అలా సీతారాం మరియు ఠాగూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ నేపథ్యంలోనే మిగతా కథ అంతా నడిచింది. చంబల్ ప్రాంతంలో తాగు నీరు, సాగు నీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు భలవంత్ సింగ్ ఠాకూర్ అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్ట పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇంజనీయర్‌ సీతారాం గురించి తెలిసి, ఆయన అయితేనే తమ కష్టాలు తీర్చగలరు అని ఆ చంబల్ ప్రాంతం ప్రజలు సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలు విని, ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు ?, ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి ?, ఇంతకీ.. డాకు మహారాజ్ ట్రాక్ ఏమిటి ?, సీతారాం డాకు మహారాజ్ గా ఎలా మారాడు ?, చివరకు డాకు మహారాజ్ ఏం సాధించాడు? ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి సీతారామ్ డాకు మహారాజ్ గా ఎందుకు మారారు? బాలయ్య పోషించిన మరో పాత్ర నానాజీ ఎవరు? డాకు మహారాజ్ చివరకు తన లక్ష్యాలను సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ : స్టార్ హీరో బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు కచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండాలని, కళ్లు చెదిరే ఎలివేషన్ సీక్వెన్స్ లు కావాలని ఫీలవుతారు. ఇవి కోరుకుని సినిమా చూసే అభిమానులను డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. బాలయ్య గత సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది. కథలో కొత్తదనం లేకపోవడం.. ఊహించినట్లుగా సినిమా ఉండడం కాస్త సినిమాకు మైనస్ అయినా.. కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే సినిమా మొదటి పదినిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించినా.. వెంటనే కథ ఊపందుకుంది . మెల్లమెల్లగా హై గేర్ లోకి మారింది. ఫ్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది.అయితే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉండడంతో.. అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయినట్లు అనిపించింది. దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ లోకి తీసుకురావడంలో, ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు.
ఫస్టాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉండగా ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సీనియర్ హీరో బాలయ్యను వయస్సుకు తగ్గ పాత్రలో చూపించడంతో పాటు ప్రేక్షకులను మెప్పించే విషయంలో బాబీ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి మంచి మాస్ సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు డాకు మహారాజ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే, సీతారామ్ గా, డాకు మహారాజ్ గా తన పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ‘డాకు మహారాజ్’తో తెలుగు తెరకు నేరుగా పరిచయం అయిన బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. శ్రద్దా శ్రీనాధ్ తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకోతో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. దర్శకుడు బాబీ కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ బాలయ్యను కొత్తగా చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను, అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్‌ లను ఎఫెక్టివ్ గా డిజైన్‌ చేశారు. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘డాకు మహారాజ్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక బాలయ్య – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు బాబీ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు.

ఎవరెలా చేశారంటే… బాలకృష్ణ నానాజీ, ఇటు డాకు మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ నటించడం సినిమాకు ప్లస్. బాబీ డియోల్ మైనింగ్ కింగ్ గా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. డాకు మహారాజ్ తర్వాత బాబీ డియోల్ కు తెలుగులో మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా వాళ్లు తన రోల్స్ కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం : ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ ఓకే. ఇక సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. థమన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగారు. బీజీఎం విషయంలో తనకు ఎవరూ సాటిరారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. అఖండ వారసత్వాని.. మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సినిమాకు సెకండ్ హీరో ఎవరైన ఉంటే అది కచ్చింతంగా థమన్ అనే చెప్పాలి బాబీ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

మొత్తం మీద ‘డాకు మహారాజ్’ తో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. దర్శకుడు బాబీ, సితార నిర్మాత నాగవంశీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్న హిట్ అందించారనే చెప్పాలి. డాకు మహారాజ్ సినిమాలో ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ సీన్లకు, బాలయ్య మార్క్ డైలాగ్స్ కు కొదువ లేదు. ఇంటర్వేల్ క్లైమాక్స్ సీక్వెన్స్ లు సైతం అదిరిపోయాయి. బాలయ్య రోల్స్ ను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దిన బాబీ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘డాకు మహారాజ్’లో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ ఫుల్ నటన, బాబీ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే… కొన్ని సన్నివేశాలు రోటీన్ గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. బాలయ్య తన నటనతో, తన మాస్ ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం బాలయ్య అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here