అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ షూటింగ్ పూర్తి

0
108
Ashok Galla's 'Devaki Nandana Vasudeva' shooting is complete
Ashok Galla's 'Devaki Nandana Vasudeva' shooting is complete

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అల్బం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఏమయ్యిందే, జై బోలో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరించి మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస
సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్