అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ నుండి ‘చిన్ని చిన్ని తప్పులేవో’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

0
6
Arjun Ambati releases lyrical video song 'Chinni Chinni Tayalevo' from 'Paramapada Sopanam'
Arjun Ambati releases lyrical video song 'Chinni Chinni Tayalevo' from 'Paramapada Sopanam'

టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ పరమపద సోపానం చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు :
అర్జున్ అంబటి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్
దర్శకత్వం : నాగ శివ
నిర్మాత : గుడిమిట్ల శివ ప్రసాద్
సహ నిర్మాత : గుడిమిట్ల ఈశ్వర్
నిర్మాణ సంస్థ : ఎస్ ఎస్ మీడియా
సంగీతం : డేవ్ జాండ్
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్
లిరికల్ వీడియో : వాల్స్ అండ్ ట్రెండ్స్
పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గణపర్తి నారాయణరావు
పీఆర్ఓ : ఫణి కుమార్ , మమతా రెడ్డి
డిజిటల్ : బిగ్ ఫిష్ మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here