‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ -4 మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

0
37
AP CM Nara Chandrababu Naidu as the chief guest for the first episode of 'Unstoppable with NBK' season-4
AP CM Nara Chandrababu Naidu as the chief guest for the first episode of 'Unstoppable with NBK' season-4

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్- 4 మొదటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్‌ షూట్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్‌స్టాపబుల్ సెట్స్ కి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్పగుచ్ఛం అందించి బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తొలి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ మధ్య అద్భుతమైన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 25న ‘ఆహా’ లో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ -4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గెట్ రెడీ….!