నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం

0
32
AP CM Chandrababu Naidu invited to Nandamuri Balakrishna Golden Jubilee celebrations
AP CM Chandrababu Naidu invited to Nandamuri Balakrishna Golden Jubilee celebrations

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసినవారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, కె. ఎల్. నారాయణ , అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, రాజా యాదవ్, అలంకార్ ప్రసాద్ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.