సురేష్ కొండేటికి మరో బాధ్యత

0
24
Another responsibility for Suresh Kondeti
Another responsibility for Suresh Kondeti

సినీ జర్నలిస్ట్, ‘సంతోషం’ సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటిని మరో పదవి వరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో గతంలో ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా, అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన సురేష్ కొండేటి ఈసారి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి చైర్మన్ గా ఎ.గోపాలరావు, కన్వీనర్ గా ఏడిద రాజా నియమితులైయారు. ఈ మేరకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కె.ఎస్. రామారావు, సెక్రటరీ తుమ్మల రంగారావు చేతుల మీదుగా సురేష్ కొండేటి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తాను దీన్ని ఒక పదవిలా కాకుండా బాధ్యతలా చూస్తానని, కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ గా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సురేష్ కొండేటి అన్నారు.