కనువిందుగా ప్రవాస భారతీయుల అపూర్వ కలయిక!

0
41
An unprecedented gathering of expatriate Indians!
An unprecedented gathering of expatriate Indians!

అట్లాంటా : ఎల్లలుదాటి తమ ప్రతిభతో పరాయి గడ్డపై అడుగుపెట్టి భారతదేశం పవర్ ని ఎలుగెత్తి చాటుతున్న ప్రవాస భారతీయుల అపూర్వ కలయికను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. పనిలో పనిగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే.. తమ పుట్టినిల్లు అయిన భారతావనికి..తమ గ్రామాలకు ఏదో చేయాలన్న తపనతో నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ తమకు తోచిన విధంగా రుణం తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో నల్గొండ సెంట్ ఆల్ ఫోన్స్ హై స్కూల్ 1987 బ్యాచ్ కు చెందిన ప్రవాస భారతీయుల అపూర్వ కలయిక ఇటీవల అట్లాంటాలో కనువిందుగా.. ఎంతో వైభవోపేతంగా జరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఇతోధికంగా తమ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించేలా కృషి సల్పుతూనే ఉన్నారు. వీరు విదేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ల ఆలోచనలన్నీ పురిటి గడ్డ చుట్టే తిరుగుతుంటాయి. మా ఊరు ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మాకు చదువు చెప్పిన పంతుళ్లు ఎలా ఉన్నారు? ఇవే.. వారి ఆలోచనలన్నీ. అది.. వారికి ఆయా ప్రాంతాలపై ఉన్న మమకారం.. ప్రేమ.. ఆప్యాత.. వాత్సల్యం .. ఇలా ఎన్నయినా అభివర్ణించొచ్చు.
ఈ ప్రవాస భారతీయుల అపూర్వ కలయికలో గుంటుక వెంకటేశ్వర్ రెడ్డ, జీతు కంచర్ల (అట్లాంటా), దయాకర్ వుమ్మడి (అట్లాంటా), వెంకటేశ్వర్ రెడ్డి. G(అట్లాంటా), శ్రీకాంత్ కీసర (బోస్టన్), ముని మాధవ్ (బోస్టన్), శ్రీధర్ వడ్డెబోయిన(బోస్టన్), సుశీల (కొలంబస్), రాజేశ్వర్ (కొలంబస్), . శ్రీమాన్ (చికాగో), కవిత చేకూరి(డల్లాస్), శ్రీనివాసులు వీరమల్ల(డల్లాస్), మంజుల దారెడ్డి (డెట్రాయిట్), శాంతి (డెట్రాయిట్), పార్వతి (డెన్వర్), విజయ్ సింహా రెడ్డి (హూస్టన్), మాలతి (మిల్వాకీ), అశ్విని (N.C), పృద్వి(న్యూజెర్సీ), శ్రీధర్ కె (సియాటిల్), వేణు గోపాల్ (శాన్ డియాగో), LN (St.Louis), చంద్రశేఖర్ బి(వర్జీనియా), రమేష్ బచు (వర్జీనియా), రామ్ మోహన్ రెడ్డి కె (భారతదేశం), శేఖర్ రెడ్డి (ఆస్ట్రేలియా), వి.జ్యోతి, సంధ్య, శ్రీనాథ్ (కెనడా) తదితరులు పాల్గొన్నారు.