సీనియర్ సినీనటి మణిమహేష్ కు ‘అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్-2024’ ప్రదానం

0
26
Akkineni Media Excellence Award given to senior film actress Manimahesh
Akkineni Media Excellence Award given to senior film actress Manimahesh
  • ఘనంగా పద్మ విభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకలు  
  •  ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతుల మీదుగా పురస్కారం
  • అనంతరం ఘనంగా సన్మానం.. మెమెంటో అందజేత
  • సినిమాతో  తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నమణిమహేష్
  •  తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకున్న మణి

హైదరాబాద్,  28 సెప్టెంబర్ : తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం త్యాగరాయ గానసభలో అతిరథమహారథుల సమక్షంలో  ఘనంగా  నిర్వహించిన  పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకల కార్యక్రమంలో  సీనియర్ సినీనటి మణిమహేష్  సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2024 అందుకున్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని అవార్డు  గ్రహీతలకు పుష్ప గుచ్చాలు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత  సినీనటి మణిమహేష్  మాట్లాడుతూ  మహానటుడు పద్మ విభూషణ్ అక్కినేని పేరుతో సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్  అందుకోవడం జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.   తనవంతుగా  సినీ కళామతల్లికి చేసిన సేవలకు లభించిన ఈ గుర్తింపును సంతోషంగా స్వీకరిస్తున్నానని తెలియజేశారు.  తనకు అన్నివేళలా  సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న  చిత్రసీమకు  ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.మరిన్ని మంచి పాత్రల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తానన్నారు.
అక్కినేని జీవితం, నటన నేటి తరాలకు పాఠ్యగ్రంథాలు:  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
అక్కినేని నాగేశ్వరరావు జీవితం నటన రెండూ విజ్ఞాన సర్వస్వం నేటి తరాలకు పాఠ్య గ్రంధం అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్జి .చిన్నారెడ్డి అన్నారు. సీల్ వెల్ కార్పొరేషన్, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ, ఆదర్శ ఫౌండేషన్,  ఆర్ఆర్ ఫౌండేషన్ నిర్వ హణలో భాషా సాంస్కృ తిక శాఖ సౌజన్యంతో సీల్ వెల్  శృతిలయ అక్కినేని జీవన సాఫల్య పుర స్కారాల ప్రదానోత్సవం శనివారం త్యాగ రాయగానసభలో కన్నుల పండువగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మీడియాలో వివిధ స్థాయిలలో పని చేస్తున్న వారికి గురుతర బాధ్యత వుంటుందని మారుతున్న కాలానికి అనుగు ణంగా సామా జిక మాధ్యమాల పోటీలో తట్టుకొని నిలబడటానికి వారికి దీక్ష నిబద్ధత అవసరం అన్నారు. అనంతరం సినీ జర్నలిస్ట్, పీఆర్వో  తేజస్వి సజ్జా  బైసదేవ దాసు, వినాయక రావు, ఇమంది రామారావు, షరీఫ్, హనుమంతరావు, మణి మహేష్ లకు మీడియా ప్రతిభా అవార్డ్స్ ను,  పివీ రమణా రావు, ఏమ్ మనోహర్, ఏ. రాజేష్,  ఎం.నాగ రాజు, శాంతి మంగి శెట్టి కృష్ణ వేణి,  భవాని సుష్మ ఈశ్వరిలకు అవార్డులను బహుకరించి అభినందనలు తెలిపారు. ఇదే వేదికపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుకు సీల్ వెల్, అక్కినేని స్పూర్తి పురస్కారాలు బహుకరించారు. సంస్థ నిర్వాహకులు, ప్రముఖ గా యని ఆమని ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. తొలుత ఆమని సుభాష్ రాజన్, నవిత, శ్రీనివాస్, అనుష తదితరులు అక్కినేని సినిమాలలోని  పాటలు సినీ సుస్వరాలు 63 శీర్షికన ఏఎన్ఆర్ నటించిన వివిధ సినిమాలలోని పాటలను మధురంగా గానం చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త అధ్యక్షత వహించి న వేదికపై వంశీ రామరాజు, పన్నాల బాల్ రెడ్డి, బొక్క భీంరెడ్డి, కుసుమ భోగరాజు, కళా రఫీ తదితరులు పాల్గొన్నారు.