నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘ఏరువాక ఆగే’ పాట విడుదల, ‘జగమెరిగిన సత్యం’ ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!

0
6
Actor Rajendra Prasad releases the song 'Yeruvaka Aage', 'Jagamerigina Satyam' hits theaters on April 18th!!!
Actor Rajendra Prasad releases the song 'Yeruvaka Aage', 'Jagamerigina Satyam' hits theaters on April 18th!!!

అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ….
జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి కొత్త నటీనటులను ఎంకరేజ్ కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి తదితరులు

డైరెక్టర్: తిరుపతి పాలె
నిర్మాత: అచ్చ విజయ భాస్కర్
కెమెరామెన్: షోయబ్
ఎడిటర్: అమర్ రెడ్డి
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ ఘటకల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here