మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డ్రగ్స్ వద్దు – జీవితమే ముద్దు… అని ఈసీఐఎల్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్,రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ… రాష్ట్ర జిల్లాలో డ్రగ్స్ ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ గురించి వినేవాళ్ళం ఈనాడు ప్రతి సినీ నటులు,పాఠశాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, కళాశాలలు, సాఫ్ట్వేర్, ఉద్యోగాలలో నుంచి మొదలుపెడితే 60 శాతం యువత డ్రగ్స్ కి బానిస మారారు. డ్రగ్స్ పైన ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలు కన్నా ఎక్కువ మొత్తంలో పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి డ్రగ్స్ అంతంకై మరిన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము. డ్రగ్స్ తీసుకున్న కుటుంబాల్లో యువత పూర్తిగా చెడిపోయారని అన్నారు. డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలివిడిగా యువతలు వాడడం వల్ల డ్రగ్స్ మత్తులో ఎవరిపై దాడి చేస్తున్నారో తెలియక కొంత కుటుంబాలపై దాడులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. డ్రస్సు మత్తులో అమ్మాయిల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. హైదరాబాద్ ఏ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ విపరీతంగా యువతకు బానిసగా మారుస్తుంది. యువత ఈ డ్రగ్స్ బానిస నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి ఈ డ్రగ్స్ అంతంకై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నాము. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు ఈ డ్రగ్స్ ను విపరీతంగా సప్లై చేస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసేవాళ్లను అప్పుడప్పుడు అరెస్టు చేస్తున్నట్టు వార్తలు కూడా చూస్తున్నాం. మరింత దృష్టి పెట్టాలని తెలియజేశారు. యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ అనేకం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అనే దానిపై అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించాలని తెలియజేశారు. యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అనేకం నిర్వహిస్తామని డ్రగ్స్ వద్దు జీవితమే వద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ జిల్లా సహాయ కార్యదర్శి అవినాష్ జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావు, రఘు ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, అజయ్, మిట్టు,సుబ్బు, నిఖిల్, నితీష్, శివ, చందు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.