ప్రపంచ చిత్రపటంలో నింగికి దూసుకెళ్తున్న భారతదేశాన్ని విమానయాన రంగంలో కూడా వేగంగా దూసుకెళ్ళేలా యువతరం ప్రతినిధిగా సిక్కోలు చిన్నోడు (చిన్నవయసులో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం రావడం) రామ్మోహన్ నాయుడు పని చేస్తారని దేశం మొత్తం ఎదురుచూస్తుంది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. డిల్లీలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరైన సందర్భంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని కలిసి శుభాకాంక్షలు తెలిపి మోడీ ప్రతిభను గుర్తించి ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని భారతదేశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా విమానయాన శాఖ పరిదిలో అవసరమైన నూతన విమానాశ్రయాలు,మౌలిక సదుపాయాలు మరియు విమానాల పెంపు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు..