విద్యార్థులకు ఆరోగ్యం,వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సు
విద్యార్థులు, ప్రతిఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
డోన్ టి ఆర్ నగర్ ఎంపిపి స్కూల్ హెచ్ ఎమ్ జి. సురేంద్రనాథ్ రావు
జూన్ 25 న స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలానీ జయంతి
సందర్బంగా విద్యార్థులకు ఆరోగ్యం,వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సు
స్వాతంత్ర్య సమరయోధులు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు. మంగళవారం
డోన్ పట్టణంలోని టి ఆర్ నగర్ లోని ఎంపీపీ స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం
జి.సురేంద్రనాథ్ రావు అద్యక్షతన సమావేశం జరిగినది.
స్వాతంత్ర్య సమరయోధులు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచితా కృపలాని జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా స్కూల్ హెచ్ ఎమ్ జి. సురేంద్రనాథ్ రావు, ఉపాధ్యాయులు ఎస్. శంషాద్ బేగం,, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి డోన్ టి ఆర్ నగర్ ఎంపిపి స్కూల్ హెచ్ ఎమ్ జి. సురేంద్రనాథ్ రావు కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.