మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

0
107

గాయపడిన బాధితుడికి సాయం..

సూర్యాపేట: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి మంత్రి హైదరాబాద్ బయల్దేరారు. ఈ  క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఓ కారు ప్రమాదవశాత్తు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన తన కాన్వాయ్‌ ఆపి అందులోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.