జాతీయ రహదారి 565 బైపాస్ ఆప్షన్ 3ను రద్దు చేయాలి

0
86

తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగె ఆప్షన్ ఒకటి లేదా రెండు వ ప్రతిపాదనలను అమలు చేయాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి

 నల్లగొండ పట్టణంలో 565 జాతీయ రహదారి నిర్మాణంలో ప్రతిపాదించిన ఆప్షన్ 3 ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు 
          సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి  మాట్లాడుతూ నల్లగొండ పట్టణానికి 565 రహదారి బైపాస్ రోడ్డు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఆర్ అండ్ బి వారి ప్రతిపాదనలు ఒకటి, రెండు, మూడు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు తక్కువ నష్టం జరుగుతూ ఎక్కువ ప్రయోజనాలు కలిగే ఒకటి ,రెండు ఆప్షన్ ప్రతిపాదనలను పంపకుండా పేద మధ్యతరగతి ప్రజల నివాసాల ఇండ్లు, ప్లాట్లు నష్టం జరిగే మూడవ ప్రతిపాదన పంపడం సరైనది కాదని సిపిఎం అభిప్రాయపడుతుందని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పైసా పైసా కూడా పెట్టుకుని ప్లాట్లు కొనుక్కున్న వారికి నష్టం జరిగే విధంగా ఉన్నదని అన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉన్న మూడవ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఒకటి లేదా రెండు ఆప్షన్ల ఎంపిక చేసుకోవడం ద్వారా వ్యవసాయ భూములు మాత్రమే భూసేకరణ జరుగుతుందని దాని ద్వారా ఆ ప్రాంత భూములు ధరలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని, పారిశ్రామికంగా హోటల్స్ ,మెకానిక్ షెడ్లు, షోరూమ్స్, ఇతర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావడంతో పట్టణ  ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు .తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి మరియు రెండును ఎంపిక చేసుకోకుండా ఆప్షన్ మూడును ఎంపిక చేసుకోవడం వలన 2780 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రోడ్ల విస్తరణ విషయంలో సంబంధిత ఆర్ అండ్ బి మంత్రి జోక్యం చేసుకొని ప్రజలకు ఎక్కువ నష్టం జరిగే ఆప్షన్ మూడు ప్రతిపాదనను ఉపసమరించుకొని, తక్కువ నష్టంతో ప్రజలకు ఎక్కువ మేలు జరిగే ఒకటి లేదా రెండు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపి 565 నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల బాధితులతో కలిసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
 ఈ కార్యక్రమంలో  సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం,పట్టణ కార్యదర్శి యం డి సలీమ్, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పుచ్చకాయల నర్సిరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ఉట్కూరి నారాయణరెడ్డి, పట్టణ నాయకులు అద్దంకి నరసింహ కుంభం కృష్ణారెడ్డి, దండెంపల్లి సరోజ, గాదె నర్సింహ, సలివొజు సైదాచారి,మారగొని నగేష్,బాధితులు శేఖర్ రెడ్డి,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పుష్పలత విజయలక్ష్మి కవిత కలమ్మ బలరాం శివ జగన్ రామకృష్ణ హరీష్ మంజుల భవాని సింగం లింగయ్య పాల్గొన్నారు