రెగులర్ ఎమ్మార్వో ను వెంటనే నియమించాలి

0
96

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్

కుత్బుల్లాపూర్ మండలానికి రహమాన్ ఎమ్మార్వో గా వచ్చినప్పటి నుండి ఎన్నికల పని అంటూ ఎమ్మార్వో కార్యాలయానికి రాకుండా తాత్సారం చెయ్యడం,గత 2 నెలల నుండి సరిగ్గా కార్యలయనికి రాకపోవడం,ఇప్పుడేమో సెలవుల్లో ఉండటం వల్ల ఇంచార్జి ఎమ్మార్వో ఉండటం వల్ల ప్రజలకు వివిధ రకాల పత్రాల మంజూరులో ఇబ్బందులకు గురవుతున్నారు.
కావున కలెక్టర్ వెంటనే కుత్బుల్లాపూర్ మండలానికి రెగులర్ రెవిన్యూ అధికారిని వెంటనే నియమించాలని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాలు అమలులో నిమగ్నమై ఉండాలని,అదే విదంగా భూములు కబ్జాలు చేసిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకోవాలని , వెంటనే అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం వచ్చిన్నందున గత సంవత్సరం వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాల్లో ఈ సారి అలా జరగకుండా చర్యలు చేపట్టాలని, గాజులరామరం రావినారాయన రెడ్డి నగర్లో ఉన్న ఓపెన్ నెలల పై స్లాబులు వేయాలని,గతంలో జరిగిన ప్రాణ నష్టాల నుండి ప్రజలను కాపాడాలని కోరారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇప్పటి నుండే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,డ్రైనేజీ పొంగకుండా సిల్ట్ ను తీసివేయ్యాలని డిమాండ్ చేశారు.