‘మధురం’ టీజర్ చాలా ప్రామిసింగ్ గా వుంది..మంచి హిట్ అవుతుంది..హీరోనితిన్!!

0
33
'Madhuram' teaser is very promising..it will be a big hit..Heironithin!!
'Madhuram' teaser is very promising..it will be a big hit..Heironithin!!

యంగ్ హీరో ఉదయ్ రాజ్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ యం.బంగార్రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్ లవ్ అనేది టాగ్ లైన్. టీనేజ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని .. సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం టీజర్ ను రెటిరో స్టార్ నితిన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఉదయ్ రాజ్, దర్శకుడు రాజేష్ చికిలే, నిర్మాత బంగార్రాజు, ప్రొడక్షన్ మేనేజర్స్ వర్మ, టోనీ పాల్గొన్నారు.
*అనంతరం రెటిరో స్టార్ నితిన్ మాట్లాడుతూ.. ‘మధురం సినిమా టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది. స్వీట్, ఇన్నోసెంట్, ఒక జెన్యూన్ గా వుంది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీలా వుంది. ఈ సినిమా హిట్ అయి టీం అందరికీ మంచి బ్రేక్ రావాలి. నిర్మాత బంగార్రాజు, దర్శకుడు రాజేష్, హీరో ఉదయ్ అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ‘ ఒక హనుమంతుడు రూపంలో వచ్చి మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన నితిన్ గారికి చాలా చాలా థాంక్స్. అడగ్గానే ఆయన టీజర్ రిలీజ్ చేయడం మా సినిమాకి కొండంత బలాన్నిచ్చింది. దిల్, జయం, సై సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ టీజర్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేసిన మా సునీల్ గారికి స్పెషల్ థాంక్స్. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే దర్శకుడు రాజేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు.. మధురం ఎ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది.. అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. మా నిర్మాత బంగార్రాజు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. అలాగే మా డిఓపి మనోహర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. కొత్తవాళ్ళమైనా కూడా మా సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకుని షూటింగ్ లో బిజీగా ఉండి కూడా మా మధురం టీజర్ నితిన్ గారు రిలీజ్ చేసినందుకు ఆయనకి మా టీం అందరి తరుపున కృతజ్ఞతలు.. అన్నారు.
నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. ‘మా మధురం సినిమా టీజర్ లాంచ్ చేసిన నితిన్ గారికి నా హార్ట్ ఫుల్ థాంక్స్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం నచ్చేలా.. ఉంటుంది. సినిమా అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం సెన్సార్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోటేశ్వర రావు (బస్ స్టాప్), కిట్టయ్య , యప్. యం. బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్; మనోహర్ కొల్లి, మ్యూజిక్; వెంకీ వీణ, పాటలు; రాఖీ, ఎడిటర్; ఎన్టీఆర్, పి. ఆర్.ఓ; జిల్లా సురేష్, నిర్మాత; యం. బంగార్రాజు, కథ-మాటలు-స్రీన్ ప్లే- దర్శకత్వం; రాజేష్ చికిలే