ఉప్పల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ఏళ్ల తరబడి ఈవోలుగా కొనసాగుతున్న వారిని వెంటనే బదిలీ చేయాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కోరారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ని పరమేశ్వర్ రెడ్డి కలిసి ఈవోల పని తీరు, బదిలీల గురించి వివరించారు. నియోజకవర్గంలోని ఆలయాలలో ఈవోలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్టుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా పాతుకపోయారని గుర్తు చేశారు. ఈ విధంగా ఉండటంతో ఆలయాల వద్ద సరైన వాతావరణం లేకపోవడంతో భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలిపారు.
ఈ విధానానికి చెక్ పెట్టి కొత్తవారికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
పరమేశ్వర్ రెడ్డి వినతిపై మంత్రి కొండ సురేఖ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈవోల బదిలీకి రంగం సిద్ధం చేయాలని సంబంధిత విభాగం అధికారులకు ఆదేశించారు .
కార్యక్రమంలో పరమేశ్వర్ రెడ్డి తో పాటు మైనంపల్లి హనుమంతరావు ,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ,భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు.