బిగ్ బ్రేకింగ్: నీట్- పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

0
87

పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం

అధికారికంగా ప్రకటించిన
కేంద్ర వైద్యారోగ్య శాఖ

మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్:

నీట్- పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది.జూన్ 23వ తేదీన దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం వెల్లడించింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది.
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్- పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది.
కాగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్- యూజీ, యూజీసీ-నెట్ పరీక్ష పత్రాల లీకేజీ దేశంలో సంచలనంగా మారింది. పేపర్ లీక్ కారణంగా యూజీసీ-నెట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయగా.. నీట్ ఎగ్జామ్పై వివాదం కొనసాగుతోంది. నీట్, నెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే నీట్-పీజీ పరీక్షను కేంద్రం పోస్ట్ పోన్ చేసింది. నీట్-పీజీ ఎగ్జామ్ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.