నాణ్యమైన వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

0
44
Care of Address Telangana for Quality Silk Fabrics :
Care of Address Telangana for Quality Silk Fabrics :

చేనేతను ప్రోత్సహించడమే కోహినూర్ ఉద్దేశ్యం

సోషలైట్ డాక్టర్ సుధాజైన్

తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని సోషలైట్ డాక్టర్ సుధాజైన్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాజైన్ మాట్లాడుతూ.. చేనేత కళా కారుల ఉత్పత్తులను దేశ, విదేశాలకు పంపి చేనేత కళాకారుల ప్రతిభను చాటిచెప్పడం తమ లక్ష్యమని, చేనేత వస్త్రాలను కోనేలాగా వారు చేనేత ఉత్పత్తులను ధరించేలా చేయడమే తమ కోహినూర్ స్టోరీ ఉద్దేశమని అన్నారు. చేనేత ఉత్పత్తులను తయారు చేసే వారిని ప్రోత్సహిస్తూ తమవంతుగా చేయూతనివ్వడమే తమ ధ్యేయమని, చేనేత కళాకారుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము దోహద పడతామని శ్రీ పాండురంగ హ్యాండ్లూమ్స్ చిట్టిమల్ల పాండు చెప్పారు. విభిన్నమైన, అరుదైన చేనేత ఉత్పత్తులను వినియోగ దారులకు అందించడంతోపాటు వాటి పట్ల ఆదరణ పెంచడమే తమ ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నచేనేతనేత కార్మికులను గౌరవించడం, ప్రోత్సహించడమే ఈ కోహినూర్ ఉద్దేశ్యం అని తెలిపారు. మార్కెట్ లో లభించే నకిలీ పట్టు వస్త్రాలను ఎలా తెలుసుకోవాలో,నాణ్యమైన చేనేత వస్త్రాలను ఎలా గుర్తించాలో కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. కొంత మంది సింథటిక్ ను సిల్క్ గా అమ్ముతున్నారు. దీనిపై అవగా వాహన కల్పించడానికి తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. చేనేత కళాకారుల డిజైన్లకు ఒక రూపు తెచ్చి వారు రూపొందించిన డిజైన్లను ఇతరులు కాపీ చేయకుండా ఒక అల్బమ్ ను ఈ సందర్భంగా విడుదల చేశామని సుధజైన్ వెల్లడించారు. చేనేతకు చేయూతనివ్వాలని నంది అవార్డు గ్రహీత, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు,’హైదరాబాద్ సమయ్’ హిందీ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ మహమ్మద్ షరీఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధaరించి, చేనేతకు చేయూతనివ్వాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా చేనేత డిజైన్లను రూపొందిచాలని, నైపుణ్యం కలిగిన చేనేతకారులను ప్రోత్సహించాలని షరీఫ్ చెప్పారు. నాణ్యమైన చేనేత వస్త్రాలను డైరెక్ట్ టూ కస్టమర్ అనే ఆలోచనతో తక్కువ ధరలకే అందిస్తూ చేనేత కళాకారులను ప్రోత్సాహి స్తున్నట్లు తాను చేయ బోయే తదుపరి చిత్రం గిరి పుత్రిక లోను చేనేత వస్త్రాలను కళాకారుల (కాస్ట్యూమ్స్) కోసం వినియోగిస్తామని నిర్మాత దర్శకుడు రమేష్ రాజ చెప్పారు.