ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై డైలాగ్‌ వార్‌!

0
40
Dialogue war on the expectations of exit polls!
Dialogue war on the expectations of exit polls!

కూటమికే అధికారం ఖాయం అన్ని బుద్దా వెంకన్న
కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని సవాల్‌

విజయవాడ: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీా టీడీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌కు దారితీసింది. ఒకరికొకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్‌ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఖండిరచారు. మస్తాన్‌ చేత సీఎం జగన్‌ చెప్పించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వస్తోందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్‌ చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్‌ నాలుక కోసుకుంటారా అని అడిగారు. తన సవాల్‌ను స్వీకరించాలని బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. క్రిమినల్‌ ఆలోచనలతో జగన్‌ ఫేక్‌ సర్వే చేయించాడని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్‌కు ఉందా అని బుద్దా వెంకన్న నిలదీశారు. ’సర్వేల్లో మెజార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పాయి. ఆరా మస్తాన్‌ సర్వే ఇందుకు విరుద్దంగా ఉంది. ఓటమి తప్పదనే నిరాశలో వైసీపీ క్యాడర్‌ ఉంది. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆరా సర్వే చెప్పించారు. ఇది ఫేక్‌ సర్వే అని వైసీపీ ముఖ్య నేతలకు తెలుసు. బెట్టింగ్‌ కాసేందుకు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. వైసీపీ కీలక నేతల అనుచరులు మాత్రం టీడీపీ గెలుస్తోందని అంటున్నారు. ఈ సర్వే ద్వారా వైసీపీ అభిమానులు జగన్‌ తరఫున బెట్టింగ్‌ కాస్తారు. ఆరా మస్తాన్‌ ఫేక్‌ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఫేక్‌ సర్వేలతో వైసీపీ అభిమానుల జీవితాలను నాశనం చేస్తున్నారు. విూ ధన దాహానికి విూ వారినే బెట్టింగులతో దోచుకుంటారా..? కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయి, ప్రజల్లో వేవ్‌ వచ్చింది. ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం గతంలో ప్రజలు ఎదురు చూసే వారు కాదు. నిన్న మాత్రం చూశారు. కౌంటింగ్‌ కోసం వెళ్లే విపక్ష పార్టీల ఏజెంట్లను భయపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎంగా అడుగుపెడతానని గతంలో ప్రకటించారు. అది నిజం అవుతుంది. కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫేక్‌ సర్వే ఎవరు చెప్పించారో వెల్లడిరచాలి. కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవదు. వైసీపీ ఇచ్చిన నివేదికను ఆరా మస్తాన్‌ చదివాడు. ఆరా మస్తాన్‌ నీకు చిత్తశుద్ధి ఉంటే జూన్‌ 4వ తేదీన సాయంత్రం వాస్తవాలు వెల్లడిరచాలి అని’ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.