కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక విశేషాలు, సంగీత ప్రపంచం అన్నీ కలిసి రావాలని కోరుకున్నాను- ప్రైమ్ వీడియోలో రాబోతున్న మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’పై దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్

0
3
I wanted the family dynamics, cultural nuances and musical world to come together,”  Palnati Surya Pratap sheds light on Prime Video’s upcoming musical drama Jagamae Sangeetham
I wanted the family dynamics, cultural nuances and musical world to come together,”  Palnati Surya Pratap sheds light on Prime Video’s upcoming musical drama Jagamae Sangeetham

కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు. ఈ మేరకు

పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ .. ‘నా దృష్టిలో కుటుంబం, ఆ కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. పాత్రల మధ్య సంబంధాలు, సంఘర్షణలు, ఆశయాలు ఆవిష్కృతమయ్యేందుకు సంగీతం ఒక మాధ్యమంగా (భాషగా) పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం, దానిపై అవగాహన కూడా ఉంది. అందుకే ఆ సాంస్కృతిక అంశం కథలో సహజంగా, వాస్తవికంగా ఇమిడిపోవాలని నేను కోరుకున్నాను. ఇది నా మొదటి సిరీస్. సుదీర్ఘ నిడివి గల ప్రాజెక్ట్ కావడం వల్ల పాత్రలను, వారి భావోద్వేగ ప్రయాణాలను మరింత లోతుగా ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది.

సంగీతం దాని సంప్రదాయానికి కట్టుబడి ఉండేలా చూసుకుంటూనే, ప్రతి సంగీత ఘట్టం కథకు లేదా పాత్రలకు సహజంగా తోడ్పడేలా చేయడం నా విధానం. సంగీతం కథనానికి ఆటంకంలా అనిపించకూడదని భావించాను. కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక విశేషాలు, సంగీత ప్రపంచం అన్నీ కలిసి, తెలుగు ప్రేక్షకులకు నిజాయితీగా, తమకు దగ్గరగా అనిపించేలా ఉండాలని కోరుకున్నాను’ అని అన్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాకు వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచన చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రలలో నటించగా, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి కీలక పాత్రలలో నటించారు. ‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4, 2026న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఇది తెలుగులో ఆంగ్ల సబ్‌టైటిల్స్‌తో, తమిళ డబ్బింగ్‌తో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here