ఘనంగా హైదరాబాద్ లో సస్టెయిన్‌ఎక్స్‌ 2026 సదస్సు

0
4
SustainX Annual 2026 Summit Held Grandly in Hyderabad
SustainX Annual 2026 Summit Held Grandly in Hyderabad

హైదరాబాద్: స్థిరమైన అభివృద్ధి, బాధ్యతాయుత నాయకత్వం, భవిష్యత్‌కు సిద్ధమైన సంస్థల నిర్మాణంపై సమగ్ర చర్చలకు వేదికైన సస్టెయిన్‌ఎక్స్ (SustainX) వార్షిక సదస్సు 2026 హైదరాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సంస్థల ఉన్నతాధికారులు, నిపుణులు, సామాజిక రంగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సుస్థిరతను కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం చేయకుండా ఏఐ సాంకేతికత, సంస్థాగత నాయకత్వం, మౌలిక వసతులు, సుస్థిర కొనుగోళ్లు, భవిష్యత్ కార్యాలయాలు, ఆరోగ్య రంగం, సీఎస్‌ఆర్‌, పౌర సేవలు, సుస్థిర పర్యాటకం వంటి విభిన్న అంశాలపై జరిగిన చర్చలు సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీఎఫ్‌ఎంసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాథల సత్యనారాయణ స్ఫూర్తిదాయక ప్రసంగంతో సదస్సు అధికారికంగా ప్రారంభమైంది.

జీసీసీ కాన్‌క్లేవ్‌ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. సుస్థిర సంస్థల నిర్మాణంలో జీసీసీల మారుతున్న పాత్ర” అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మౌలిక వసతుల భవిష్యత్తుపై పర్యావరణ పరిరక్షణపై ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల (ITE&C) శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టిఅనుదీప్ అభివృద్ధిదారులను ప్రోత్సహిస్తూ ప్ర‌సంగించారు. అలాగే ప్రొక్యూర్‌మెంట్‌ కాన్‌క్లేవ్‌లో విలువ, మౌలిక వసతుల స్థిరత్వం, సుస్థిర కొనుగోళ్లపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రజలు, సాంకేతికత, ఆరోగ్యం, సామాజిక బాధ్యత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నటుడు డాక్టర్‌ భద్రం, ఆరోగ్య భద్రతపై నిర్వహించిన వన్‌ లైఫ్‌ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌లో భవిష్యత్‌ కార్యాలయాలపై చర్చలు జరిగాయి. కిమ్స్‌ హాస్పిటల్స్‌ ప్రతినిధులతో ఆరోగ్య రంగ నాయకత్వంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.

సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం
సీఎస్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌లో బాధ్యతాయుత నాయకత్వంతో బలమైన సమాజ నిర్మాణంపై చర్చ జరిగింది. సర్వేజన ఫౌండేషన్‌ కార్యక్రమాలపై ప్రజెంటేషన్‌తో పాటు సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేక ప్రసంగాలు జరిగాయి. టీఎఫ్‌ఎంసీ కేర్స్‌ ఆధ్వర్యంలో ‘సపోర్ట్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యాదాద్రి, పోచంపల్లి ప్రాంతాలను సుస్థిర పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అవకాశాలపై కూడా ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. సాయంత్రం లాయిడ్స్‌కు చెందిన ఎలిజబెత్‌ ప్రత్యేక ప్రసంగం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు సివిక్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ప్రదానం చేయగా, కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో హెల్త్‌కేర్‌ లీడర్‌షిప్‌ టాక్‌ నిర్వహించారు.

సాంకేతికత, సంస్థల అభివృద్ధి, సేవా నాణ్యత, బాధ్యతాయుత వృద్ధి అంశాలపై అనుదీప్ దురిశెట్టి దిశానిర్దేశం చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా వ్యాపార ప్రదర్శనలు, నెట్‌వర్కింగ్‌ జోన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యూజన్‌ డ్యాన్స్‌ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

ప్రభుత్వ విధానాలు, పరిశ్రమ, సాంకేతికత, మౌలిక వసతులు, ఆరోగ్యం, సీఎస్‌ఆర్‌, పౌర సేవలు, పర్యాటకం వంటి రంగాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సుస్థిర ఆలోచనలను కార్యాచరణాత్మక భాగస్వామ్యాలుగా మార్చడమే సస్టెయిన్‌ఎక్స్‌ 2026 ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here