డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి “దీపక్ బలదేవ్ ఠాకూర్”

0
3
Deepak Baldev Thakur Steps into Film Distribution
Deepak Baldev Thakur Steps into Film Distribution

“గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ” ద్వారా నటీనటులకు శిక్షణ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ లతోపాటు…ప్రొడక్షన్, డైరెక్షన్ లోనూ తనను తాను నిరూపించుకున్న “దీపక్ బలదేవ్ ఠాకూర్” ఇప్పుడు “డిస్ట్రిబ్యూషన్” రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా “ఒరిస్సా, నార్త్ ఇండియా”లపై దృష్టి సారిస్తున్నారు. తెలుగు-తమిళ భాషలతోపాటు హిందీలోనూ విస్తృతమైన పరిచయాలు కలిగిన దీపక్… “ఓటీటీ, శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్” కూడా డీల్ చేస్తుంటారు. పాన్ ఇండియా అప్పీల్ కలిగిన సబ్జెక్టులతో… ప్రణాళికాబద్ధంగా ప్రొడక్షన్ చేసే నూతన నిర్మాణ సంస్థలకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో “టై అప్” చేయించగలిగే సామర్ధ్యం దండిగా కలిగి ఉన్న దీపక్ కు తెలుగులో సినిమా నిర్మాణం చేసిన అనుభవం ఉండడంతోపాటు… హిందీ సినిమాకు దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉంది!!

త్వరలో “సిల్వర్ జూబ్లీ” (పాతికెళ్ల ప్రస్థానం) జరుపుకుంటున్న “గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ” అధినేతగా ఉన్న దీపక్… షార్ట్ కట్ లో డబ్బు సంపాదించడం కంటే… “గుడ్ విల్”కే ఎక్కువ విలువనిస్తారు. కనుకనే గత పాతికేళ్లుగా సినిమా రంగంలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోగలిగారు. ఈ రంగంలో మరెన్నో అద్భుతాలు చేయాలి, తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే దృఢ సంకల్పం కలిగిన దీపక్ బలదేవ్ ఠాకూర్… ముంబైలోని తన చిరకాల మిత్రుడు రాజేష్ సింగ్ తో కలిసి… “ఒరిస్సా అండ్ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్” బిజినెస్ కు శ్రీకారం చుట్టారు. “మన శంకర్ వరప్రసాద్ గారు”తో బోణి కొట్టిన వీరు… మహేష్ బాబు “దూకుడు” రీ రిలీజ్ చేయడంతోపాటు… “లెనిన్” సినిమాతో చాలా పెద్ద విజయం అందుకున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా “ముఠామేస్త్రి” చిత్రాన్ని కూడా ఈ రెండు ఏరియాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో విఎఫెక్స్ ప్రధానంగా తెరకెక్కిన “కర్మస్థలం” చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here