స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకోవాలి సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

0
157

స్వాతంత్ర్య సమర యోధురాలు దువ్వూరి సుబ్బమ్మ వర్దంతి సందర్బంగా డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న తొలి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ 1880 లో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి అని ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహనీయురాలు. ఈమె స్వాతంత్ర్యోద్యం వైపు అడుగులు వేసి కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది. ఈమె 1922 సంవత్సరంలో సహాయ
నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అంతే కాకుండా ఈమె ఉప్పు సత్యాగ్రహం,
క్విట్ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నది. 1964 సంవత్సరం మే 31 తేదీన ఈమె పరమపదించింది.ఇలాంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.