హైద్రాబాద్, , జూన్ 1: అఖిలభారత స్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ (ఐఐటీ ప్రవేశపరీక్ష) లో నాచారంకు చెందిన నల్లా కాన్షి రామ్ ఉత్తీర్ణత సాధించారు. భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్య సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థలల్లో ప్రవేశం కోసం మే 17వ తేదీన దేశ వ్యాపితంగా 1,90000 ( ఒక లక్ష తొంబై వేల) మంది పరీక్ష రాశారు. అందులో కాన్షి రామ్ అల్ ఇండియా స్థాయిలో 5407 ర్యాంకు సాధించారు. అంతకు ముందు ఏప్రిల్ లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కు సుమారుగా 13 లక్షల మంది హాజరవగా 2 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో నల్లా కాన్షి రామ్ 92 శాతంతో ఉ త్తీర్ణత సాధించి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా తాను చదివిన కాలేజ్ సిబ్బందికి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ టీచర్స్ కి, జన్మనిచ్చిన తల్లి తండ్రులైన నల్లా రాధాకృష్ణ – చీరాల అన్నపూర్ణ లకు కృతజ్ఞతలు తెలియ జేశారు. తాను గొప్ప ఇంజనీర్ అయి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలన్నదే తన కోరిక అని ఖాన్సీ రామ్ తెలిపారు. తన తండ్రి నల్లా రాధా కృష్ణా బహుజనుల ఆశయాల కోసం చేసిన సేవలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ( తన తండ్రి) చేస్తున్న జాతీయ – అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సేవలకు అనుకూలంగా నేను కూడా ఈ భారత దేశ పౌరులకు నావంతు బాధ్యతగా సేవలు అందించి మెప్పు పొందాలి అనేదే నా సంకల్పమని ఖాన్సీ రామ్ వివరించారు.





