వైఎస్సార్సీపీ నేతల్లారా.. దళిత సోదరులను పావులుగా వాడుకోకండి!

0
134
YSRCP leaders.. don't use Dalit brothers as pawns!
YSRCP leaders.. don't use Dalit brothers as pawns!

వైసీపీ కుల రాజకీయం ఇది..

వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట!

పల్లెటూరి జాతరలలో మద్యం అనేది సహజం. ఇక డప్పు కొట్టే సోదరుల గురించి అయితే చెప్పనాక్కర్లేదు. డప్పు కొట్టి, కొట్టి చేతులు నొప్పులు వస్తాయి కాబట్టి మద్యం సేవించడం కామన్. అలాంటి సంఘటనే శ్రీ మరిడమ్మ జాతరలో జరిగింది . కొంచెం అతిగా మద్యం సేవించిన ఒక డప్పు కారుడు మత్తులో అర్థం కాక అయ్యన్న పాత్రుడి గారి కాలి గాయం మీద తొక్కాడు. దానికి అయ్యన్న గారు రియాక్ట్ అయ్యారు.. అంతేకాని ఎలాంటి ఉద్దేశ్యంతో కానీ అలాంటి పని చేయలేదు, అయ్యన్న గారి కుటుంబం గురించి మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరినీ సొంత కుటుంబ సభ్యుల వలే దగ్గరకు తీసుకునే వ్యక్తిత్వం గల కుటుంబమది. అలాంటి కుటుంబంలో వ్యక్తి కావాలని ఎందుకు చేస్తాడు .? కానీ ఈ సంఘటనను అడ్డు పెట్టుకొని వైసీపీ కుల రాజకీయం చేయాలని, దళితుల సోదరులను రెచ్చగొట్టి కుల కుంపట్లు పెట్టాలని ఎంతో ఆగర్లాడుతుంది. ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళిత సోదరులపై జరిగిన ఘోరమైన సంఘటనలలో డాక్టర్ సుధాకర్ గారి మరణం ఒకటి. గ్లౌస్ లు , మాస్క్ లు లేవు అని అడిగినందుకు పిచ్చి వాడు అని ముద్ర వేసి నడిరోడ్డు పై అర్ధనగ్నంగా కూర్చో బెట్టి మానసిక ఆందోళనకి గురయ్యేలా, చివరకి చనిపోయేలా చేసి ఆనంద పడ్డారు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.. అలాంటి మీకు దళిత బిడ్డల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..?

శ్రీ మరిడమ్మ జాతరలో జరిగిన చిన్న సంఘటనను చూపించి వందల ఏళ్ల చరిత్ర కలిగిన మన సంప్రదాయాలను, పండుగలను కూడా రాజకీయ రంగు పూసి అపహాస్యం చేయడం ఎంతవరకు సమంజసం? నర్సీపట్నం నుంచి శ్రీకాకుళం వరకు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న శ్రీ మరిడమ్మ తల్లీ పండుగ వైభవాన్ని చూసి ఓర్వలేక బురద జల్లడం మీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆ వేడుక వెనుక ఉన్న శ్రమను, భక్తిని గౌరవించాల్సింది పోయి.. దళిత సోదరులను మధ్యలోకి లాగి వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదు. అంకితభావంతో పనిచేసే నాయకులపై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అయ్యన్నపాత్రుడు గారిపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

నిజాలను నిర్భయంగా చెప్పే గొంతును కుల రాజకీయాలతో నొక్కలేరు! అని ప్రజలు వాపోతున్నారు.