‘ఓ అందాల రాక్షసి’ అద్భుతమైన కంటెంట్‌తో జనవరి 2న రాబోతోంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు షెరాజ్ మెహదీ

0
73
O Andala Rakshasi Arriving on January 2 promises Compelling Content: Hero & Director Sheraz Mehdi at Pre-Release Event
O Andala Rakshasi Arriving on January 2 promises Compelling Content: Hero & Director Sheraz Mehdi at Pre-Release Event

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రం జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. ఒక ఏడాదికి ఓ మంచి సినిమా వస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే మా ‘ఓ అందాల రాక్షసి’. ఇందులో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. అద్భుతమైన కంటెంట్‌తో రాబోతోన్న ఓ మంచి సినిమా. ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. మంచి సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.

కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ గారు అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ గారు హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

కృతి వర్మ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన షెరాజ్ గారికి థాంక్స్. జనవరి 2న మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రేక్షకుల సపోర్ట్‌తో మా చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

విహాన్షి హెగ్డే మాట్లాడుతూ .. ‘‘అమ్మాయిల్ని మోసం చేస్తే.. ఆ అందం రాక్షసిగా మారుతుంది. అదే మా ‘ఓ అందాల రాక్షసి’. ఈ చిత్రం, కథ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన షెరాజ్ గారికి, భాష్య శ్రీ, సురేందర్ గారికి థాంక్స్’ అని అన్నారు.