సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్

0
83
'Sankalp Diwas' will be celebrated on November 28 under the auspices of Suchirindia Foundation.
'Sankalp Diwas' will be celebrated on November 28 under the auspices of Suchirindia Foundation.

  • “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” పద్మశ్రీ జాదవ్ పయెంగ్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం..!
  • ఈ వేడుకకి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.

సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం ‘సంకల్ప్ దివాస్’లో “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” పద్మశ్రీ జాదవ్ పయెంగ్ ను ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని మౌంటైన్ హైట్స్, శిల్పారామం, హైటెక్ సిటీ లో ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

లయన్ డాక్టర్ వై. కిరణ్ గారి ప్రతి ఆలోచన, ప్రతి అడుగు సమాజ సేవ గురించే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి పుట్టినదే ‘సంకల్ప్ దివాస్’. ‘సుచిరిండియా ఫౌండేషన్’ తలపెట్టిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం. ప్రస్తుత ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందించడం మొదలుకొని, భవిష్యత్ కి బాటలు వేసే వస్తులను అందించడం వరకు ‘సంకల్ప్ దివాస్’ చేస్తోంది. అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తుంది.