మతిభ్రమించి మాట్లాడుతున్న బి ఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్ : నీలం పద్మ

0
156
BRS leaders who are talking in a delirious manner are Khabardar: Neelam Padma
BRS leaders who are talking in a delirious manner are Khabardar: Neelam Padma

నిన్నగొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారిపై మాట్లాడిన తీరును ఖండిస్తూ మీరు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒక్క రోజైనా ఆలేరు అభివృద్ధిపై మీ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడినారా? మా ఎమ్మెల్యే ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని 36 సార్లు కలిసి ఆలేరు అభివృద్ధి కీ కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే హర్షించేది పోయి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత పది ఏళ్ల మీ పరిపాలనలో మీ సొంత ఆస్తులు,వ్యాపారాలు పెంచుకున్నారే తప్ప ఆలేరు అభివృద్ధిపై ఏరోజు దృష్టి పెట్టలేదు .గంధ మల్ల ప్రాజెక్టు మీరు సాంక్షన్ చేస్తే , గత పది ఏళ్ల నుండి కట్టకుండా ఏం చేసిండ్రు ఆలేరు ప్రజలకు తెలపాలి.పక్కన ఉన్న భువనగిరి ఎమ్మెల్యే బస్వాపూర్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నారు, ఆ సోయి కూడా నీకు లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇలాకాలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఎట్ల పూర్తయినాయి. నీ అసమర్థత చేతగానితనం వల్ల ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు. మెడికల్ కాలేజ్ మీ హయాంలో సాంక్షన్ చేసాం అంటున్నారు .మరి ల్యాండ్ కేటాయించినట్లు జీవో చూపిస్తారా. మా ఎమ్మెల్యే ప్రభుత్వ బీ బీర్ల ఐలయ్య గారు ఈనెల మూడో తారీఖున దాతర పెళ్లి సర్వేనెంబర్ 92లో 20 ఎకరాలు ల్యాండ్ కేటాయించి మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించడానికి జీవో తేప్పించారు. మీ చేతగాని పాలనలో పక్క జిల్లాల్లో జనగామ, సూర్యాపేట, నల్గొండ లలో మెడికల్ కాలేజీలు పూర్తయితే కనీసం మీరు భూమి కేటాయించిన పాపాన పోలేదు. పదవి అడ్డం పెట్టుకొని ఎంతసేపటికి మీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెంచుకున్నారే తప్ప ఆలేరు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు.మా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారు అహర్నిశలు కృషి చేసి, ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించి సుమారు 1500 వందలకోట్ల పనులకు జీవోలు ఇప్పించి తన పుట్టినరోజును ఆలేరుకి పండుగ రోజు చేశారు. మీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు వాసాల మరిని,బంగారు వాసాలమర్రి చేస్తానని చెప్పి ఇండ్లన్నీ కులగొట్టి విధ్వంసం చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున తాసిల్దార్,ఆర్డీవో గార్లతో సర్వే చేయించి అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిజమైన బంగారు వాసాలమర్రి చేయబోతున్నారు. గతంలో మీరు కమిషన్లకు కక్కుర్తి పడ్డారు కాబట్టే ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనులు చేయలేదు. యాదగిరిగుట్ట అభివృద్ధి పైన కూడా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు. ఆటో సౌకర్యం. కొబ్బరికాయలు కొట్టుడు .కొండపైన నిద్రించడం కల్పించారు, కనీసం మీ పదేళ్ల అసమర్ధత పాలనలో మూటకొండూరు మండలంలో ఎందుకు ప్రభుత్వ భవనాలు కట్టలేదు.మా MLA గారు వచ్చే పది తరాలకు ఉపయోగపడే విధంగా కొలనుపాక, కాల్వపల్లి గ్రామాల్లో హై లెవెల్ బ్రిడ్జిలు 15కోట్లతో సాంక్షన్ చేయించారు.మా ఎమ్మెల్యే గారు చేసే మంచి పనులు చూసి ఓర్వలేక అక్కస్తో మాట్లాడుతున్నారని నీలం పద్మ వెంకటస్వామి హెచ్చరించారు.