మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శక, నిర్మాత అరుముగ కుమార్ తెరకెక్కించిన ‘ఏస్’ చిత్రం ట్రైలర్ విడుదల

0
6
Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd
Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd

వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది.

శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. మే 23న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే సోషల్ మీడియాలో వదిలారు.

‘ఏస్’ ట్రైలర్‌లో.. ‘నా పేరు బోల్ట్ కాశీ’ అంటూ హీరో తనని తాను పరిచయం చేసుకోవడం.. ఆ పేరు ఏంటి? అలా ఉందేంటి? అంటూ యోగిబాబు కామెడీ చేయడం, హీరో హీరోయిన్ల పరిచయం, మలేసియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయి. జూదం అనేది ఉప్పెనలాంటిది.. క్లైమాక్స్ గుర్తుంది కదా అంటూ యోగి బాబు చెప్పే కామెడీ డైలాగ్ బాగుంది. హీరో వేసే ప్లాన్ ఏంటి? అసలు దేని కోసం పోరాటం చేస్తున్నాడు? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

‘ఏస్’ ట్రైలర్‌లో సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కరణ్ బి. రావత్ కెమెరా వర్క్ చాలా రిచ్‌గా కనిపించింది. ఇక ఈ మూవీని మే 23న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

నటీనటులు : విజయ్ సేతుపతి, యోగి బాబు, రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిసిల్లా నాయర్, జాస్పర్ సుపయా, కార్తీక్ జే, నాగులన్, జహ్రినారిస్ తదితరులు

సాంకేతిక బృందం
నిర్మాత & దర్శకుడు : ఆరుముగకుమార్
బ్యానర్: 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్
DOP: కరణ్ బి రావత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సామ్ సిఎస్
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
పీఆర్ఓ: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here