తెలుగు సినిమాల‌పై 100శాతం ట్యాక్స్ విధించిన ట్రంప్ నిర్ణ‌యాన్ని ఖండించిన డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్

0
13
Dr. Pratani Ramakrishna Goud Condemns Trump's Decision to Impose 100% Tax on Telugu Films
Dr. Pratani Ramakrishna Goud Condemns Trump's Decision to Impose 100% Tax on Telugu Films

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న ఒక జీవో జారీ చేసినట్లు న్యూస్ లో చూడడం జరిగింది.  ఇండియన్ సినిమాలు, అమెరికాయేతర సినిమాలపై 100 శాతం టాక్స్ విధిస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయం అని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీ కాదు. 24 క్రాఫ్ట్ లలో కొన్ని లక్షల మంది కార్మికుల జీవనాధారం ఫిల్మ్ ఇండస్ట్రీ. మన సౌత్ ఇండియన్ సినిమాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీస్తున్నారు. ఇక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయో, అమెరికాలో కూడా అదే విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అమెరికా లో మన ఇండియన్స్ కూడా లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇండియన్ సినిమాలకు కూడా అక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి.  ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే భారీ బడ్జెట్లో సినిమాలు తీస్తున్నారు. సక్సెస్ అయిన సినిమాలు చిన్నా పెద్దా తేడా లేకుండా  అమెరికాలో కూడా కలెక్షన్ రాబడుతున్నారు. కానీ ఇప్పుడు 100 శాతం  టాక్స్  విధానం అంటే మన సినిమాలను అక్కడ డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ఎవ్వరూ సాహసించరు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ గారికి మా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి. పెంచిన 100 శాతం టాక్స్ విధానాన్ని వెనక్కి తీసుకుని ఇది వరకు లాగా ఉంచాలని కోరుతున్నాము. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచ దేశాలన్నింటికి పెద్దన్నలా భావిస్తాం. కాబట్టి మీ తమ్ముళ్ళుగా వుండే ఈ దేశాలను, రాష్ట్రాలను అన్నింటిని దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాల ఫిల్మ్ ఇండస్ట్రీలకు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇంగ్లీష్ మూవీస్ కూడా ఇండియా లో అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్నాయి. కానీ టాక్స్ విధానంలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. అది మీరు దృష్టిలో ఉంచుకుని  టాక్స్ విధానాన్ని మునుపటిలా యధావిధంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.